Avanthi Srinivas: అలాంటి వాళ్లకు కూడా పెన్షన్లు ఇవ్వాలా?: మంత్రి అవంతి

AP Minister Avanthi Srinivas responds on criticism over pensions
  • పెన్షన్ల తొలగింపులు అంటూ విపక్షాల విమర్శలు
  • స్పందించిన మంత్రి అవంతి
  • కార్లలో తిరిగే వాళ్లు పెన్షన్లు పొందుతున్నారని వెల్లడి
  • అర్హులకు పెన్షన్లు తొలగించలేదని స్పష్టీకరణ
ఏపీలో పెన్షన్లలో కోత విధించారని, చాలామందికి పెన్షన్లు తొలగించారని విపక్షాలు చేస్తున్న విమర్శలపై మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు, కార్లలో తిరిగే వాళ్లు కూడా పెన్షన్లు పొందుతున్నారని, అలాంటి వాళ్లకు కూడా పెన్షన్లు ఇవ్వాలా? అని ప్రశ్నించారు. మంచిపనులు చేస్తున్న ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని విమర్శించారు. పెన్షన్లు తీసేశారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అర్హులైన వారిలో ఏ ఒక్కరి పెన్షన్ తొలగించలేదని మంత్రి స్పష్టం చేశారు.
Avanthi Srinivas
Pensions
YSRCP
Andhra Pradesh

More Telugu News