Jeevitha: బండ్ల గణేశ్ వ్యాఖ్యలపై జీవిత స్పందన ఇదిగో!

Jeevitha responds on Bandla Ganesh issue
  • ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో కలకలం
  • వైదొలగిన బండ్ల గణేశ్
  • జీవితపై అసంతృప్తితోనే అని వార్తలు
  • తమ మధ్య విభేదాలు లేవన్న జీవిత
  • అందరం 'మా' కోసం పనిచేస్తామని వెల్లడి
'మా' ఎన్నికలు జరగకముందే ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో కలకలం రేగింది. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ తప్పుకోవడం తెలిసిందే. 'మా' ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్నట్టు బండ్ల గణేశ్ ప్రకటించారు.

ఇటీవల జీవితా రాజశేఖర్... ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో చేరారు. అయితే ఆమె ప్రకాశ్ రాజ్ ప్యానెల్లోకి రావడం పట్ల బండ్ల గణేశ్ అసంతృప్తితో ఉన్నట్టు, అందుకనే ప్యానెల్ నుంచి తప్పుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై జీవిత స్పందించారు.

తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. 'మా' అభివృద్ధి కోసమే బండ్ల గణేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని పేర్కొన్నారు. తనపై వ్యతిరేకతతో ప్యానెల్ నుంచి తప్పుకున్నాడని తాను భావించడంలేదని వెల్లడించారు. 'మా' లో సభ్యత్వం ఉన్నవాళ్లు ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయొచ్చని జీవిత తెలిపారు. ఎవరు గెలిచినా 'మా' అభివృద్ధి కోసమే పనిచేస్తారని వివరించారు.
Jeevitha
Bandla Ganesh
MAA
Elections
Tollywood

More Telugu News