Amrullah Saleh: తాలిబన్ల కాల్పుల్లో నేను గాయపడితే నా తలకు గురిపెట్టి రెండు రౌండ్లు కాల్చు... తన బాడీగార్డుకు సూచించిన ఆఫ్ఘన్ నేత అమృల్లా సలేహ్

Amrullah Saleh comments about latest situation
  • తాలిబన్లకు, పంజ్ షీర్ దళాలకు మధ్య పోరు
  • పంజ్ షీర్ లోయలో ఉన్న అమృల్లా సలేహ్
  • తాలిబన్లకు లొంగేది లేదని ప్రతిన
  • తాజా పోరాటంలో తాలిబన్లకు తీవ్రనష్టం!
పంజ్ షీర్ ప్రాంతంలో తాలిబన్లకు, ప్రతిఘటన దళాలకు మధ్య హోరాహోరీ పోరాటం కొనసాగుతున్న నేపథ్యంలో.... ఆఫ్ఘనిస్థాన్ స్వయంప్రకటిత ఆపద్ధర్మ అధ్యక్షుడు అమృల్లా సలేహ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తాలిబన్ల దాడిలో తాను గాయపడితే తన తలకు గురిపెట్టి రెండు రౌండ్లు కాల్పులు జరపాలని తన అంగరక్షకుడికి స్పష్టం చేశారు. మరణించేందుకైనా సిద్ధం తప్ప, తాలిబన్ల ముందు ఎప్పటికీ తలవంచేది లేదు అని పేర్కొన్నారు.

ఆఫ్ఘనిస్థాన్ లో అన్ని ప్రావిన్స్ లు తాలిబన్లకు లొంగిపోయినా, పంజ్ షీర్ మాత్రం పోరాటమే ఊపిరిగా సమరశంఖం పూరించింది. గడచిన 24 గంటల్లో తాలిబన్లు వందల సంఖ్యలో మరణించినట్టు కథనాలు వచ్చాయి. ఆఫ్ఘన్ దిగ్గజ కమాండర్ అహ్మద్ షా మసూద్ తనయుడు అహ్మద్ మసూద్ నేతృత్వంలోని పంజ్ షీర్ దళాలు తాలిబన్లను తరిమికొట్టేందుకు తీవ్ర పోరాటం సాగిస్తున్నాయి.
Amrullah Saleh
Panjshir
Taliban
Afghanistan

More Telugu News