Avanthi Srinivas: 10 కంటే ఎక్కువ కేసులు నమోదైతే పాఠశాలలను మూసివేయాలని ఆదేశాలిచ్చాం: మంత్రి అవంతి
- ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
- తెరుచుకున్న పాఠశాలలు
- స్కూళ్లలో కరోనా కేసులు తక్కువేనన్న అవంతి
- ఇంటర్ ఆన్ లైన్ అడ్మిషన్లపైనా స్పందన
ఏపీలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పందించారు. 10 కంటే ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదైన పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. పాఠశాలల్లో 0.001 శాతం మాత్రమే కరోనా కేసులు నమోదవుతున్నాయని అన్నారు.
అటు, ఇంటర్ ఆన్ లైన్ అడ్మిషన్లపై హైకోర్టు తీర్పు పట్ల కూడా మంత్రి అవంతి స్పందించారు. ఈ ఏడాది ఆన్ లైన్ అడ్మిషన్లు చేసుకోవచ్చని గతేడాది హైకోర్టు తీర్పు ఇచ్చిందని, కానీ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు కోర్టుల ద్వారా అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. ఇంటర్, డిగ్రీలో ఆన్ లైన్ అడ్మిషన్ల ద్వారా రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో అమలవుతాయని వివరించారు.