Sensex: మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్
- 17 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 15 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 2.53 శాతం లాభపడ్డ హెచ్డీఎఫ్సీ లిమిటెడ్
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు ఈరోజు బ్రేక్ పడింది. మధ్యాహ్నం వరకు నష్టాల్లో కొనసాగిన మార్కెట్లకు ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతు లభించడందో లాభాల్లోకి వెళ్లాయి. అయితే చివర్లో ఇన్వెస్టర్లు మళ్లీ లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 17 పాయింట్లు నష్టపోయి 58,279కి పడిపోయింది. నిఫ్టీ 15 పాయింట్లు కోల్పోయి 17,362 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-2.53%), భారతి ఎయిర్ టెల్ (-2.48%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.20%), ఐటీసీ (-1.15%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.84%).
టాప్ లూజర్స్:
సన్ ఫార్మా (-1.81%), టెక్ మహీంద్రా (-1.69%), యాక్సిస్ బ్యాంక్ (-1.58%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.44%), ఇన్ఫోసిస్ (-1.36%).