Low Pressure: బంగాళాఖాతంలో మరింత బలపడిన అల్పపీడనం... ఏపీలో భారీ వర్షాలు
- వాయవ్య-పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
- తీవ్ర అల్పపీడనంగా మారిన వైనం
- అనుబంధంగా ఉపరితల ద్రోణి
- మత్స్యకారులకు హెచ్చరికలు
వాయవ్య-పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. ప్రస్తుతం ఇది తీవ్ర అల్పపీడనంగా మారి దక్షిణ ఒడిశా, ఛత్తీస్ గఢ్ దిశగా పయనిస్తోంది. తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది.