Pawan Kalyan: వినాయక చవితికి కరోనా నిబంధనలు ఎందుకు?: పవన్ కల్యాణ్
- ఏపీలో వినాయక చవితిపై ఆంక్షలు
- బహిరంగ వేడుకలు వద్దన్న ప్రభుత్వం
- వైసీపీ కార్యక్రమాలకు నిబంధనలు అడ్డురావా? అన్న పవన్
- సంస్మరణ సభకు కరోనా లేదా? అంటూ ఆగ్రహం
ఏపీలో వినాయక చవితి వేడుకలపై ఆంక్షలు విధించడాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తప్పుబట్టారు. వినాయక చవితికి కరోనా నిబంధనలు వర్తింపజేయడం ఎందుకని ప్రశ్నించారు. వైసీపీ కార్యక్రమాలకు కరోనా నిబంధనలు అడ్డురావా? సంస్మరణ సభకు కరోనా లేదా? అని నిలదీశారు. విపక్షాలు నిరసనలు చేస్తే కరోనా కేసులా? అంటూ మండిపడ్డారు.
పవన్ కల్యాణ్ నేడు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానం మేరకు పవన్ హస్తిన చేరుకున్నారు. ప్రహ్లాద్ జోషితో భేటీ అనంతరం, బీజేపీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఏపీలో వినాయక చవితిపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం పట్ల బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్న సంగతి తెలిసిందే.