Somu Veerraju: వైసీపీ ప్రభుత్వ ఊసరవెల్లి వేషాలను వినాయకుడు గమనిస్తూనే ఉన్నాడు: సోము వీర్రాజు

Somu Veerraju fires on minister Vellampalli Srinivasarao
  • వినాయక చవితిపై ఆంక్షలు
  • భగ్గుమంటున్న బీజేపీ నేతలు 
  • వెల్లంపల్లిపై సోము వీర్రాజు ఆగ్రహం
  • మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరిక
వినాయక చవితి వేడుకలపై విధించిన ఆంక్షలను తొలిగించాలంటూ ఏపీ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుపై రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ధ్వజమెత్తారు. వెల్లంపల్లి మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు.

ప్రభుత్వ సొమ్ముతో చర్చిలు కట్టిస్తూ, వక్ఫ్ బోర్డు ఆస్తులకు ప్రహరీ గోడలు నిర్మిస్తూ, పాస్టర్లకు, ఇమామ్ లకు, మౌజంలకు జీతాలు ఇస్తున్నారని ఆరోపించారు. "మతతత్వ వాదులు ఎవరు? మీరా... మేమా? సనాతన పవిత్ర హిందూ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం పోరాడుతున్న మేం మతతత్వ వాదులమా? వెల్లంపల్లి నోటికొచ్చినట్టు మాట్లాడం మానుకోవాలి" అని స్పష్టం చేశారు.

'వైసీపీ ప్రభుత్వ ఊసరవెల్లి వేషాలను విఘ్నేశ్వరుడితో పాటు సమస్త హిందూ ప్రజానీకం గమనిస్తూనే ఉంది' అని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.
Somu Veerraju
Vellampalli Srinivasa Rao
Vinayaka Chavithi
Andhra Pradesh

More Telugu News