Afghanistan: పీహెచ్డీలు, పీజీలకు విలువ లేదు: తాలిబన్​ విద్యాశాఖ మంత్రి

Taliban Education Minister Says PHD and PGs Have No Value

  • వారికన్నా మేమే గొప్ప
  • ముల్లాలు, తాలిబన్లు అధికారంలో ఉన్నారు
  • వైరల్ గా మారిన వీడియో

ప్రభుత్వం ఇలా ఏర్పాటయ్యిందో లేదో అప్పుడే తాలిబన్లు తమ అసలు రంగును బయటపెట్టేస్తున్నారు. చదువులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతూనే, పరదాలు కట్టించి పాఠాలు చెప్పిస్తున్నారు. తాజాగా విద్యాశాఖ మంత్రి షేక్ మాల్వీ నూరుల్లా మునీర్ అలాంటి వ్యాఖ్యలే చేశారు. అసలు చదువుకే విలువ లేదన్నట్టు మాట్లాడారు.

‘‘ఈ పీహెచ్డీలు, పీజీలు ఇప్పుడు అన్నీ దండగ. మీరు చూస్తూనే ఉన్నారు కదా.. మా ముల్లాలు, తాలిబన్లం ఇప్పుడు పదవిలో ఉన్నాం. పీహెచ్డీలు, పీజీలు చేసిన వారి కన్నా మంచి స్థానాల్లో ఉన్నాం. వారందరికన్నా మేమే గొప్ప’’ అని అన్నారు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది.

ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వారి నుంచి ఇలాంటి మాటలు కాకపోతే ఇంకా ఏం ఆశిస్తామంటూ మండిపడుతున్నారు. ఉన్నత విద్యా మంత్రికి ఉన్నత విద్య అంటే విలువ లేదు మరి అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇలాంటి వాళ్లు అధికారంలో ఉంటే పిల్లలు, యువతకు విపత్తేనని అన్నారు.

  • Loading...

More Telugu News