Sharmila: మంద కృష్ణ మాదిగను కలిసిన వైఎస్ షర్మిల.. ఈ నెల 12న దళిత భేరి
- మందకృష్ణను పరామర్శించిన షర్మిల
- ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న వైఎస్సార్టీపీ అధినేత్రి
- త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
- 12న నిర్వహించే దళిత భేరి బహిరంగ సభకు ఆహ్వానం
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఇటీవల బాత్రూంలో కాలు జారి పడడంతో బోన్ ఫ్రాక్చర్ అయిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కలిశారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె ఫొటో పోస్ట్ చేశారు.
'ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మంద కృష్ణ మాదిగ గారిని ఈ రోజు తన నివాసంలో కలసి పరామర్శించడం జరిగింది. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాను. అలాగే, సెప్టెంబరు 12న వైఎస్సార్ తెలంగాణ పార్టీ తిరుమలగిరిలో నిర్వహించే "దళిత భేరి" బహిరంగ సభకు ఆయనను ఆహ్వానించాను' అని షర్మిల తెలిపారు.