ananta sriram: ఈ పోస్ట‌ర్‌లో నేనూ ఉన్నానండోయ్.. 'రామ్ చరణ్‌- శంకర్' సినిమా ఫస్ట్ పోస్ట‌ర్‌పై గేయరచయిత అనంత శ్రీ‌రామ్

ananta sriram on movie poster
  • కొన్ని కలయికలు మనం అనుకుంటే జరగవు
  • 'ఆయనకి'అనిపిస్తే జరుగుతాయి
  • దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు గారికి కృత‌జ్ఞ‌త‌లు
  • షూటింగ్ ప్రారంభోత్స‌వ ఫొటోలు వైర‌ల్
టాలీవుడ్ హీరో రామ్ చరణ్‌తో క‌లిసి ద‌ర్శ‌కుడు శంకర్ రూపొందిస్తోన్న సినిమా షూటింగ్ ఈ రోజు ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆ సినిమా బృందం ఆస‌క్తిక‌ర పోస్ట‌ర్ విడుద‌ల చేసింది. ఇందులో తాను కూడా ఉన్నాన‌ని తెలుపుతూ సినీ గేయ ర‌చ‌యిత అనంత శ్రీ‌రామ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.
                       
కొన్ని కలయికలు మనం అనుకుంటే జరగవు. 'ఆయనకి'అనిపిస్తే జరుగుతాయి..  దర్శకులు శంకర్ గారికి, నిర్మాత దిల్ రజు గారికి, సంగీత దర్శకుడు తమన్ గారికి  ధన్యవాదాలు అని అనంత శ్రీ‌రామ్ చెప్పారు. ఈ పోస్ట‌ర్ లో తాను ఎక్క‌డున్నానో తెలుపుతూ ఆయ‌న ఆ పిక్ పోస్ట్ చేశారు.

కాగా, ఈ సినిమా షూటింగ్ ను క్లాప్ కొట్టి మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. షూటింగ్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా తీసుకున్న ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్స‌వంలో పాల్గొన్నారు. కాగా, రామ్ చ‌ర‌ణ్ న‌టించిన ఆర్ఆర్ఆర్ మూవీ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న విష‌యం తెలిసిందే.
 
   
ananta sriram
Tollywood
Ramcharan

More Telugu News