Sunil Gavaskar: గవాస్కర్ టీ20 జట్టు... ధావన్ కు దక్కని చోటు!

Gavaskars T20 team
  • ఓపెనర్లుగా రోహిత్, కోహ్లీ
  • వన్ డౌన్ సూర్యకుమార్ యాదవ్
  • పాండ్యా సోదరులకు చోటు
టీ20 ప్రపంచకప్ కు సమయం దగ్గరపడుతోంది. అక్టోబర్ 17న యూఏఈ, ఒమన్ వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. రెండు, మూడు రోజుల్లో టీ20 ప్రపంచకప్ జట్టును బీసీసీఐ ప్రకటించబోతోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ 15 మంది ఆటగాళ్లతో తన టీ20 జట్టును ప్రకటించారు.

అయితే, సన్నీ జట్టులో శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్ లకు చోటు దక్కలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయాలని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. బ్యాటింగ్ ఆర్డర్ లో సూర్యకుమార్ యాదవ్ కు మూడో స్థానాన్ని కేటాయించారు. పాండ్య సోదరులిద్దరికీ తన జట్టులో సన్నీ స్థానం కల్పించారు.

సునీల్ గవాస్కర్ టీ20 జట్టు:
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చాహల్. అయితే వాషింగ్టన్ సుందర్ ఫిట్ నెస్ సాధిస్తేనే చోటు దక్కుతుందని గవాస్కర్ చెప్పారు.
Sunil Gavaskar
T20 Team

More Telugu News