Dubai sheikh: దుబాయ్ షేక్ నోట ‘సిరివెన్నెల’ పాట!

Dubai Sheikh Shakes Internet with Sirivennala Song
  • అక్షరం పొల్లుపోకుండా చక్కగా ఆలపించిన దుబాయ్ షేక్
  • టిక్‌టాక్‌లో షేర్ చేయడంతో వైరల్
  • ఫిదా అవుతున్న తెలుగు సినీ ప్రియులు
తెలుగు సినిమా పాటలు ఎల్లలు దాటిన విషయం మనందరికీ తెలుసు. తెలుగులో ఉన్న వెలుగు అలాంటిది మరి. ప్రపంచంలో ఏమూలనైనా ఎక్కడో చోట తెలుగు పాట వినిపిస్తూనే ఉంటుంది. అందులోనూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు అయితే మరీను. ఆయన పాటలు అజరామరం. ప్రాంతాలు, దేశాలు అందుకు అడ్డుకట్ట కాబోవని తాజాగా ఓ దుబాయ్ షేక్ నిరూపించారు.

1986లో వచ్చిన ‘సిరివెన్నెల’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని పాటలన్నీ ఆణిముత్యాలే. ఈ సినిమాకు పాటలు రాసిన సీతారామశాస్త్రి తన ఇంటి పేరునే ‘సిరివెన్నెల’గా మార్చుకున్నారు. ఇక ఇందులోని ‘విధాత తలపున’ అనే పాట అప్పట్లో ఎంత పాప్యులర్ అయిందో, ఇప్పుడు అంతకంటే ఎక్కువగా అది ఇంటర్నెట్‌ను చుట్టేస్తోంది. కారణం.. ఓ దుబాయ్ షేక్ ఆ పాటను ఆలపించడమే!

ఆ పాటను ఏమాత్రం పొల్లుపోకుండా, లయ తప్పకుండా ఆయన చక్కగా ఆలపించారు. టిక్‌టాక్‌లో ఆయన షేర్ చేసిన వీడియో ఇతర సామాజిక మాధ్యమాలకూ పాకేసింది. ఇది చూసిన తెలుగు సినీ ప్రియులు ‘ఔరా!’ అంటున్నారు. మీరూ వినండి మరి.

Dubai sheikh
Sirivennela
Song
SP Balasubrahmanyam
TikTok

More Telugu News