Ravichandran Ashwin: ప్రతి చీకటి వెనుక వెలుగు తప్పకుండా ఉంటుంది: అశ్విన్ భావోద్వేగం

There will be light after darkness says Ravichandran Ashwin

  • నాలుగేళ్ల తర్వాత టీ20 జట్టులో అశ్విన్
  • భావోద్వేగానికి గురైన అశ్విన్
  • ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న స్పిన్నర్ 

వచ్చే నెల ఐసీసీ టీ20 ప్రపంచకప్ జరగబోతోంది. ఈ మెగా టోర్నీకి బీసీసీఐ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. మరోవైపు, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు నాలుగేళ్ల తర్వాత టీ20 జట్టులో స్థానం దక్కింది. ఈ సందర్భంగా అశ్విన్ భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశాడు.

'ప్రతి చీకటి వెనుక వెలుగు తప్పకుండా ఉంటుంది. అయితే ఆ వెలుతురు చూడగలనని నమ్మినవాడే ఆ చీకటి ప్రయాణాన్ని తట్టుకుని నిలబడతాడు' అంటూ అశ్విన్ ట్వీట్ చేశాడు. సంతోషం, కృతజ్ఞత అనే రెండు పదాలు తానేంటో నిర్వచిస్తాయని చెప్పాడు. ఈ కోట్ ను తన డైరీలో కొన్ని లక్షల సార్లు రాసుకున్నానని తెలిపాడు. మనం చదివే మంచి మాటలను తప్పని సరిగా పాటిస్తే జీవితంలో ఏదో ఒక చోట మనకు ప్రేరణ కలిగిస్తాయని చెప్పాడు.

ప్రస్తుతం రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లండ్ లో ఉన్నాడు. ఇంగ్లండ్ తో ఇప్పటి వరకు జరిగిన నాలుగు టెస్టులకు ఆయన రిజర్వ్ బెంచ్ కే పరిమితమయ్యాడు.

టీమిండియా టీ20 జట్టు:
విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్ పంత్‌ (వికెట్‌కీపర్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌కీపర్‌), హార్ధిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్‌ చాహర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ ఉన్నారు. స్టాండ్‌ బై ప్లేయర్స్‌గా శ్రేయస్‌ అయ్యార్‌, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌ ఎంపికయ్యారు.

  • Loading...

More Telugu News