Kim Jong Un: ఉత్తర కొరియా అధినేత కిమ్ స్లిమ్ లుక్... వీడియో ఇదిగో!

North Korea supreme leader Kim Jong Un looks very slim in a military parade
  • ప్యాంగ్ యాంగ్ లో మిలిటరీ పరేడ్
  • హాజరైన కిమ్
  • 20 కేజీల బరువు తగ్గిన  కిమ్
  • హుషారుగా కనిపించిన వైనం
ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ గతంలో ఊబకాయంతో కనిపించేవారు. అయితే తాజాగా ఆయనను చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఎంతో స్లిమ్ లుక్ లో నాజూకుగా దర్శనమిచ్చారు. ప్యాంగ్ యాంగ్ లోని కిమ్ ఇల్ సంగ్ స్క్వేర్ లో నిర్వహించిన మిలిటరీ పరేడ్ లో కిమ్ జాంగ్ ఉన్ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. బాగా సన్నబడిన కిమ్ హుషారుగా కలియదిరుగుతూ, ప్రజలకు అభివాదం చేస్తూ అలరించారు.

ఇంతకుముందు అధిక బరువుతో బాధపడిన కిమ్ అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. ధూమపానంతోనూ ఆయన ఇబ్బందులపాలయ్యారు. కిమ్ జాంగ్ ఉన్న దాదాపు 20 కేజీలు బరువు తగ్గారని పొరుగుదేశం దక్షిణ కొరియా ప్రజాప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.
Kim Jong Un
Slim Look
Military Parade
Pyongyong
North Korea

More Telugu News