Crime News: చిత్తూరు జిల్లాలో దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన‌ పోలీసులు.. వీడియో ఇదిగో

police robbery video gies viral

  • రోడ్డు ప‌క్క‌న వస్త్ర దుకాణంలో ఘ‌ట‌న‌
  • సీసీ కెమెరా ద్వారా గుర్తించిన య‌జ‌మాని
  • పోలీసుల‌పై పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు

రాత్రి పూట దొంగ‌త‌నాలు జ‌ర‌గ‌కుండా చూసేందుకు పోలీసులు వాహ‌నాల్లో గ‌స్తీ తిరుగుతుంటారు. చోరీలు, నేరాలు జ‌ర‌గ‌కుండా చూసుకోవ‌డ‌మే వారి విధి. అయితే, చోరీలు జ‌ర‌గకుండా చూడాల్సిన పోలీసులే.. దొంగ‌త‌నాలు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీ కెమెరాకు చిక్కాయి.

ఓ ఏఎస్‌ఐ, కానిస్టేబుల్ రాత్రి స‌మ‌యంలో  రోడ్డు పక్కన ఉన్న ఓ చిన్న బట్టల దుకాణంలో చోరీ చేశారు. ఇద్దరు పోలీసులు దుకాణం వ‌ద్దే స్కూటర్ ఆపి, ఫుట్‌పాత్‌పై ఉండే వస్త్ర దుకాణంలోకి వెళ్లి దుస్తులు తీసుకుని వెళ్లిపోయారు.

చోరీ జరిగిన ఆరు రోజుల తర్వాత సీసీ కెమెరా ద్వారా ఈ విష‌యం బయట పడింది. పోలీసుల‌పై దుకాణ‌ యజమాని పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. దుస్తులు చోరీ చేసింది ఏఆర్ కానిస్టేబుల్ అని, అత‌డికి సాయం చేసిన‌ మరో పోలీసు ఏఆర్ ఏఎస్ఐ అని అధికారులు నిర్ధారించారు. అయితే, ఈ విష‌యాన్ని బ‌య‌ట‌కు చెప్ప‌లేదు. చివ‌ర‌కు మీడియాకు ఈ సీసీ దృశ్యాలు చిక్క‌డంతో విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

  • Loading...

More Telugu News