Atchannaidu: కానూరులో ప్రైవేటు స్థలాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను తొలగించడం సరికాదు: అచ్చెన్నాయుడు

Atchannaidu questions AP Govt on Ganesh Idols removing
  • వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకోవచ్చన్న కోర్టు
  • విగ్రహాలు తొలగించడానికి పోలీసులు ఎవరన్న అచ్చెన్న
  • భక్తులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్
  • చిత్తశుద్ధితో పాలించాలని హితవు
భక్తుల మనోభావాలతో సీఎం జగన్ చెలగాటమాడుతున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. విజయవాడ కానూరులోని ప్రైవేటు స్థలాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను తొలగించడం సరికాదని అన్నారు. విగ్రహాల ఏర్పాటుపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాక... విగ్రహాల ఏర్పాటును వద్దనడానికి పోలీసులు ఎవరని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలు వినాయకచవితి జరుపుకోవడం జగన్ కు ఇష్టం లేదా? అని ప్రశ్నించారు. తొలగించిన విగ్రహాలను తిరిగి ప్రతిష్ఠాపన చేసి భక్తులకు క్షమాపణలు చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. చెత్తశుద్ధిని పక్కనబెట్టి చిత్తశుద్ధితో పరిపాలన చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని హితవు పలికారు.
Atchannaidu
Ganesh Idols
Kanuru
Vijayawada
CM Jagan
Andhra Pradesh

More Telugu News