USA: విమానంలో మాస్కు లేకపోతే డబుల్ ఫైన్.. అమెరికా ప్రభుత్వం నిర్ణయం

US orders double fine for not wearing mask on flights

  • విమానంలో మాస్కు పెట్టుకోవాలని కోరితే సిబ్బందితో వాగ్వాదాలు
  • పలు వీడియోలు నెట్టింట్లో వైరల్
  • ఆగ్రహం వ్యక్తం చేసిన అధ్యక్షుడు బైడెన్

ఇటీవలి కాలంలో అమెరికాలో కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. వాటిలో కొందరు ప్రయాణికులు విమానాల్లో మాస్కులు పెట్టుకోలేదు. అది నిబంధనలకు విరుద్ధమని, మాస్కులు ధరించాలని కోరిన సిబ్బందితో వాగ్వాదాలకు దిగారు. ఇప్పటికే విమానాల్లో మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ అమెరికాలో చట్టాలు చేశారు.

తొలిసారి ఇలా మాస్కు లేకుండా కనిపిస్తే 250 డాలర్ల జరిమానా, మరోసారి దొరికితే 1500 డాలర్ల జరిమానా విధిస్తామని ప్రభుత్వం తెలిపింది. అయినా సరే మాస్కులు ధరించని కొందరు విమాన సిబ్బందితో గొడవలు పడుతున్నారు. దీనిపై అమెరికా ప్రభుత్వం సీరియస్ అయింది. ఇలాంటి వారికి విధించే జరిమానాను రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయం గురించి అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాట్లాడుతూ.. ‘‘వాళ్ల విధులు నిర్వర్తిస్తున్న విమాన సిబ్బందిపై ఈ ప్రయాణికులు చూపిస్తున్న ఆగ్రహం తప్పు. ఇది వికారంగా ఉంది’’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. విమాన సిబ్బందికి గౌరవం ఇవ్వాలని సూచించారు.

ఈ క్రమంలో ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (రవాణా భద్రతా విభాగం) ఒక ప్రకటన చేసింది. ఇకపై విమానాల్లో మాస్కు లేకుండా కనిపించే వారికి తొలిసారి అయితే 500 నుంచి 1000 డాలర్లు, మళ్లీ ఇలాగే కనిపిస్తే 1000 నుంచి 3000 డాలర్లు జరిమానా విధిస్తామని ప్రకటించింది.

  • Loading...

More Telugu News