Ajay Devgn: బేర్‌గ్రిల్స్‌తో అజయ్ దేవగణ్.. మాల్దీవుల్లో షూట్!

Ajay Devgn to feature on Into The Wild With Bear Grylls
  • అక్షయ్ కుమార్ తర్వాత బాలీవుడ్ నుంచి అజయ్ దేవగణ్
  • గతంలో ప్రధాని మోదీ కూడా
  •  ‘రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్’తో డిజిటల్‌లోకి అజయ్ దేవగణ్
బేర్‌గ్రిల్స్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒళ్లు గగుర్పొడిచే సాహస కృత్యాలతో చిన్నాపెద్దలకు పెద్ద ఫ్యాన్‌గా మారిపోయాడు బేర్‌గ్రిల్స్. డిస్కవరీ చానల్‌లో అతడి షో ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ వస్తోందంటే అందరూ టీవీలకు అతుక్కుపోతారు. సూపర్ స్టార్స్ అక్షయ్ కుమార్, రజనీకాంత్ నుంచి ప్రధాని నరేంద్రమోదీ వరకు ఆయనతో అడవుల్లోకి వెళ్లి సాహసాలు చేసినవారే. ఇప్పుడీ జాబితాలోకి మరో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ చేరబోతున్నాడు. 52 ఏళ్ల దేవగణ్ మాల్దీవుల్లో బేర్‌గ్రిల్స్‌తో కలిసి నడవబోతున్నాడు. ఈ విషయాన్ని మేకర్స్ ఈ రోజు వెల్లడించారు.
 
ఇటీవల విడుదలైన ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ సినిమాలో కనిపించిన అజయ్ దేవగణ్.. గంగూబాయి కథియావాడితోపాటు తెలుగులో స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సిరీస్ ‘రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్’ అనే క్రైమ్ థ్రిల్లర్‌తో డిజిటల్‌ అరంగేట్రం చేయబోతున్నాడు.
Ajay Devgn
Bear Grylls
Bollywood
Discovery

More Telugu News