Taliban: సైన్యం కళ్లుగప్పి ఏళ్ల తరబడి కాబూల్‌లో తిరిగా: తాలిబన్ అధికార ప్రతినిధి జబియల్లా

Lived in Kabul for years right under everyones noses Taliban spokesperson Zabihullah Mujahid

  • అమెరికా, ఆఫ్ఘన్ సైన్యానికి చిక్కకుండా తప్పించుకున్నా
  • దేశమంతా తిరుగుతూ రహస్య సమాచారాన్ని సేకరించా
  • నన్ను పట్టుకునేందుకు స్థానికులకు డబ్బులు ఇచ్చేవారు

ఏళ్ల తరబడి అజ్ఞాతంలో గడిపిన తాలిబన్ అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ (43) తాజాగా ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. తమ శత్రువులైన ఆఫ్ఘనిస్థాన్, అమెరికా సైనికుల సోదాల్లో పట్టుబడకుండా తాను చాలాసార్లు తప్పించుకున్నానని, వారి కళ్లుగప్పి కాబూల్‌లోనే దీర్ఘకాలంపాటు ఉన్నానని తెలిపారు. దేశమంతా రహస్యంగా తిరుగుతూ రహస్య సమాచారం సేకరించానని, తమ ముఠాకు సాయపడ్డానని గుర్తు చేసుకున్నారు.

ఇక ఆ సమాచారం తాలిబన్లకు ఎలా తెలిసేదో సైన్యానికి అర్థమయ్యేది కాదని అన్నారు. తన ఆచూకీని కనిపెట్టేందుకు అమెరికా బలగాలు స్థానికులకు డబ్బులు కూడా ఇచ్చేవని అన్నారు. తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌ను తానెప్పుడూ చూడలేదన్నారు. అయితే, ఒమర్ వారసులైన షేక్ ముల్లా మన్సూర్, షేక్ హెబతుల్లా నాయకత్వంలో పనిచేశానని పేర్కొన్నారు. కాగా, ఇప్పటి వరకు అజ్ఞాతంలో గడిపిన జబియుల్లా గత నెలలో ఆప్ఘనిస్థాన్ తాలిబన్ల వశమయ్యాక మీడియా ముందుకు వచ్చారు.

  • Loading...

More Telugu News