Wife: ఇంటర్వ్యూకు వెళ్లిన చెల్లి.. సడెన్గా వచ్చి చితక బాదిన అక్క.. కారణం ఏంటంటే?
- చెల్లిపై ఆగ్రహంతో ఊగిపోయిన అక్క
- ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్లినట్లు తెలిసి ఆఫీసుకు వెళ్లి మరీ దెబ్బలాట
- భర్తతో ఎఫైర్ పెట్టుకున్నట్లు తెలియడంతోనే
ఆమెకు ఉద్యోగం లేదు. తాజాగా ఒక కంపెనీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది. అక్కడ ఇంటర్వ్యూకు వెళ్లింది. అధికారులు ఆమెను రకరకాల ప్రశ్నలు వేసి ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంతలో ధబేలున ఆ గది తలుపు తెరుచుకుంది. లోపలకు వచ్చిన ఒక యువతి.. ఇంటర్వ్యూలో పాల్గొంటున్న అమ్మాయిపై దాడి చేయడం మొదలు పెట్టింది. ఆమె ఎంత కసిగా కనిపించిందంటే.. చుట్టుపక్కల వాళ్లు వెళ్లి ఆ గొడవ ఆపడానికి కూడా భయపడ్డారు.
ఇక్కడ దెబ్బలాడుకున్న వాళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లు కావడం విశేషం. ఇంటర్వ్యూలో ఉన్న చెల్లిపై అక్క దాడి చేయడానికి బలమైన కారణం ఉందండోయ్. తన భర్తతో చెల్లి ఎఫైర్ పెట్టుకున్నట్లు ఈ అక్కకు తెలిసిందట. అందుకే చెల్లి ఏ ఆఫీసులో ఇంటర్వ్యూలో పాల్గొంటుందో తెలుసుకుని మరీ అక్కడకు వచ్చింది. ఆమె కనిపించగానే మీదపడి కొట్టిపారేసింది.
డల్లాస్ అనే ట్విట్టర్ హ్యాండిల్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు అక్క చేసింది కరెక్టే అంటుంటే.. మరికొందరేమో ఇలా ఇంటర్వ్యూలో ఉండగా చెల్లిపై దాడి చేయడం పద్ధతి కాదని అంటున్నారు.