Hyderabad: హైద‌రాబాద్‌లోని ఈ రెండు ప్రాంతాల్లోనూ స్వచ్ఛమైన గాలి ఉందట!

Jubilee Hills and Uppal has best air quality in Hyderabad
  • జూబ్లీహిల్స్, ఉప్పల్ లో నాణ్యమైన గాలి
  • తన నివేదికలో వెల్లడించిన పీసీబీ
  • ఈ నెల 7న జూబ్లీహిల్స్, ఉప్పల్ లో 30 నుంచి 50 మధ్య గాలి నాణ్యత నమోదు
నానాటికీ వాతావరణ కాలుష్యం అధికమవుతోంది. నగరాల పరిస్థితి అయితే మరింత దారుణంగా తయారవుతోంది. పొల్యూషన్ వల్ల ప్రజలు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. మన హైదరాబాద్ విషయానికి వస్తే... నగరంలోని రెండు ప్రాంతాల్లో స్వచ్ఛమైన గాలి లభిస్తోందట. వాటిలో ఒకటి జూబ్లీహిల్స్ కాగా... రెండోది ఉప్పల్ అని తేలింది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్ పీసీబీ) వెల్లడించింది. తన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో ఈ విషయాన్ని తెలిపింది. నగరంలో నాణ్యమైన గాలి లభించేది జూబ్లీహిల్స్ లో అని చెప్పింది. ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా అయినప్పటికీ ఎయిర్ క్వాలిటీ బాగుందని తెలిపింది.

ఈ నెల 7న జూబ్లీహిల్స్, ఉప్పల్ లో 30 నుంచి 50 మధ్య గాలి నాణ్యత నమోదయింది. ఈ రెండు ప్రాంతాలతో పాటు ప్యారడైజ్, బాలానగర్, చార్మినార్ ప్రాంతాల్లో కూడా గాలి నాణ్యత బాగుందని పీసీబీ తెలిపింది. జీడిమెట్ల ప్రాంతంలో మాత్రం పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని చెప్పింది. గాలి నాణ్యత విషయానికి వస్తే 0 నుంచి 50 వరకు ఉంటే బాగుందని... 51 నుంచి 100 మధ్య ఉంటే సంతృప్తికరమని... 101 నుంచి 200 మధ్య ఉంటే ఓ మాదిరి అని... 201 నుంచి 300 మధ్య ఉంటే పూర్ అని... 301 నుంచి 400 మధ్య ఉంటే వెరీ పూర్ అని... 400 పైన నమోదయితే తీవ్ర కాలుష్యంగా భావిస్తారు.
Hyderabad
Air Quality
Jubilee Hills
Uppal
Best Air Quality
PCB

More Telugu News