Afghanistan: ఆఫ్ఘన్‌ సంక్షోభం: ఐక్యరాజ్య సమితి పిలుపుతో బిలియన్ డాలర్ల సాయం

donors pledge over 1 billion dollar aid to Afghanistan
  • తాలిబన్ల వశమైన తర్వాత ఆహారం, నిధుల కొరత
  • ఆఫ్ఘనిస్థాన్‌కు ఆపన్నహస్తం అందించాలన్న యూఎన్
  • ప్రజలకు సాయం చేసేందుకు బిలియన్ డాలర్ల విరాళం
  • ముందుకొచ్చిన ప్రపంచదేశాలు
తాలిబన్ల వశమైన తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌లో భయంకరమైన మానవతా సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. దీంతోపాటు ఇక్కడి ఆర్థిక వ్యవస్థ పతనం అవడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆహార పదార్థాల కొరత కూడా ఆప్ఘన్ ప్రజలను కటకటలాడిస్తోంది. ఈ క్రమంలో ఆఫ్ఘన్ ప్రజలకు సాయం చేయాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది.

ఆఫ్ఘనిస్థాన్‌పై జెనీవాలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ మాట్లాడుతూ.. ఆఫ్ఘన్‌కు ఆర్థిక సాయం చేయాలని ప్రపంచ దేశాలను కోరారు. దీంతో పలు దేశాలు ఆఫ్ఘన్‌కు సాయం చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఒక బిలియన్ డాలర్లపైగా అంటే మన లెక్కల్లో రూ.7 వేల కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సాయం చేసేందుకు దాతలు ముందుకొచ్చారట.

ఆఫ్ఘనిస్థాన్‌కు సాయం చేయడం ద్వారా ప్రపంచ దేశాలు మానవతా దృక్పథాన్ని చాటాలని గుటెరస్ కోరారు. ఈ నెలాఖరుకల్లా 1.4 కోట్ల మంది ఆఫ్ఘన్లు ఆహారం లేక అల్లాడుతారని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (డబ్ల్యూఎఫ్‌పీ) తెలిపింది. ఇలా సేకరించిన విరాళాల్లో అధికభాగాన్ని డబ్ల్యూఎఫ్‌పీనే ఉపయోగిస్తుంది. ఆఫ్ఘన్‌లో 93 శాతం మంది ప్రజలకు సరైన ఆహారం అందుబాటులో లేదని ఈ సంస్థ గుర్తించిందని తెలుస్తోంది. వీరికి ఆహారం అందేలా చేయడమే ప్రస్తుతం దీని లక్ష్యం.
Afghanistan
Taliban
WHO
WFP
Food

More Telugu News