Delhi: ఎల్‌జేపీ ఎంపీపై ఢిల్లీలో అత్యాచారం కేసు నమోదు

LJP MP Prince Paswan booked on rape charges Delhi Police
  • లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) ఎంపీ ప్రిన్స్‌రాజ్‌పై కేసు 
  • మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చి అత్యాచారానికి తెగబడ్డాడంటూ ఫిర్యాదు
  • కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసిన పోలీసులు
లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) ఎంపీ ప్రిన్స్‌రాజ్‌పై ఢిల్లీలో అత్యాచారం కేసు నమోదైంది. ప్రిన్స్‌రాజ్ తనపై అత్యాచారానికి ఒడిగట్టారంటూ మూడు నెలల క్రితం ఎల్‌జేపీ మహిళా కార్యకర్త ఒకరు ఫిర్యాదు చేశారు. ప్రిన్స్‌రాజ్ గతేడాది తనకు మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చి అత్యాచారం చేశాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఈ నెల 9న కోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు కన్నౌట్ స్టేషన్ పోలీసులు ఎంపీపై అత్యాచారం, సాక్ష్యాల ధ్వంసం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తనపై కేసు నమోదైన నేపథ్యంలో ముందస్తు బెయిలు కోరుతూ ఎంపీ ప్రిన్స్ రాజ్ నిన్న కోర్టును ఆశ్రయించారు.
Delhi
LJP MP
Prince Raj
Rape Case

More Telugu News