Andhra Pradesh: ఏపీ ఫైబర్ నెట్ కేసు: రెండోరోజూ వేమూరి హరిప్రసాద్ విచారణ
- సీఐడీ ఆఫీసుకు వెళ్లిన వేమూరి
- టెర్రాసాఫ్ట్ కు టెండర్లివ్వడంపై ఆరా
- నిన్న ఇన్ కాప్ మాజీ ఎండీ విచారణ
ఏపీ ఫైబర్ నెట్ కేసులో సీఐడీ రెండో రోజు విచారణను కొనసాగించింది. ఇవాళ్టి విచారణకు వేమూరి హరిప్రసాద్ హాజరయ్యారు. విజయవాడ, సత్యనారాయణపురంలోని సీఐడీ కార్యాలయంలో అధికారులు ఆయన్ను విచారించారు. నిన్న కూడా ఆయనతో పాటు ఇన్ కాప్ మాజీ ఎండీ సాంబశివరావును సీఐడీ విచారించింది.
టెర్రా సాఫ్ట్ కు అక్రమ మార్గాల్లో టెండర్లు ఖరారు చేయడంపై అధికారులు ప్రశ్నలు సంధించారు. ఫైబర్ నెట్ కేసులో మొత్తం 19 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. వేమూరి హరిప్రసాద్ ఏ1గా, సాంబశివరావు ఏ2గా ఉన్నారు. విచారణ కోసం మిగతా నిందితులకూ సీఐడీ నోటీసులను ఇవ్వనుంది.