Somu Veerraju: పాఠ్యపుస్తకాల్లో కూడా మత ప్రచారానికి పూనుకున్నారా?: జగన్ పై సోము వీర్రాజు ఫైర్

Somu Veerraju question Jagan on religious lessons in text books
  • చిన్నారుల మెదళ్లలో కూడా మతాన్ని చొప్పిస్తున్నారా?
  • మీ మత వ్యాప్తికి హద్దులు లేవా?
  • మత ప్రచారాలను వెంటనే పాఠ్యపుస్తకాల నుంచి తొలగించండి
వైసీపీ పాలనలో మతమార్పిడులు జరుగుతున్నాయంటూ బీజేపీ ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి జగన్ పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర విమర్శలు గుప్పించారు. పాఠ్యపుస్తకాల్లో క్రైస్తవ మతం గురించి ఉన్న పాఠాన్ని ట్విట్టర్ లో ఆయన షేర్ చేస్తూ మండిపడ్డారు.

చిన్నారుల మెదళ్లలో కూడా మీ మతాన్ని చొప్పించడానికి... వారి పాఠ్యపుస్తకాలలో సైతం మత ప్రచారానికి పూనుకున్నారా జగన్ గారూ? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ మత వ్యాప్తికి హద్దులు లేవా? అని ప్రశ్నించారు. ఇలాంటి మత ప్రచారాలను వెంటనే చిన్నారుల పాఠ్యపుస్తకాల నుంచి తొలగించండి. లేదంటే బీజేపీ నుంచి పత్రిఘటన ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
Somu Veerraju
BJP
Jagan
YSRCP
Religious Conversion

More Telugu News