Sharmila: రేపిస్ట్ రాజు ఆత్మహత్య చేసుకుని ప్రభుత్వ అసమర్థతను వేలెత్తి చూపిస్తూనే ఉన్నాడు: వైఎస్ షర్మిల
- ప్రభుత్వ అసమర్థతను చెబుతున్నాడు
- కేసీఆర్ పాలనలో పోలీసులపై ప్రజలకులేని నమ్మకాన్ని చూపుతున్నాడు
- మేము నిన్న చేసిన దీక్ష వల్లే ఈ రోజు మంత్రులు దిగొచ్చారు
- బాధిత కుటుంబాన్ని పరామర్శించారు
హైదరాబాద్‌లోని సైదాబాద్ బాలిక హత్యాచార నిందితుడు రాజు రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్య చేసుకున్న ఘటనపై వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల స్పందించారు. తాము నిన్న చేసిన దీక్ష వల్లే ఈ రోజు మంత్రులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారని ఆమె చెప్పుకొచ్చారు.
'సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల పాపను అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తే 6 రోజులైనా ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ముఖం చెల్లని ఈ ప్రభుత్వ పెద్దలు.. మేము నిన్న చేసిన దీక్ష వల్ల దిగొచ్చి ఈ రోజు మంత్రులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
నిన్న, మొన్న ఆ కుటుంబాన్ని కలవడానికి రాని మంత్రులు ఈరోజు నిందితుడు చనిపోయిన తరువాత ఆ కుటుంబాన్ని కలవడానికి పోటీ పడటానికి సిగ్గుండాలె. నిందితుడిని పట్టుకోవడంలో వైఫల్యానికి ఒక్క ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. రేపిస్ట్ ఆత్మహత్య చేసుకొని ప్రభుత్వ అసమర్థతను, కేసీఆర్ పాలనలో పోలీసులపై ప్రజలకులేని నమ్మకాన్ని వేలెత్తి చూపిస్తూనే ఉన్నాడు' అంటూ షర్మిల ట్వీట్లు చేశారు.