Sensex: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in profits

  • 418 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 110 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 7 శాతానికి పైగా పెరిగిన ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్ వాల్యూ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు తొలి గంటలో నష్టాల్లోకి జారుకున్నప్పటికీ... ఆ తర్వాత మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 418 పాయింట్లు పెరిగి 59,141కి ఎగబాకింది. నిఫ్టీ 110 పాయింట్లు పెరిగి 17,630కి చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (7.34%), ఐటీసీ (6.83%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (4.46%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.07%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (1.87%).

టాప్ లూజర్స్:
టీసీఎస్ (-1.32%), టెక్ మహీంద్రా (-1.28%), టాటా స్టీల్ (-1.25%), భారతి ఎయిర్ టెల్ (-1.02%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.70%).

  • Loading...

More Telugu News