Sajjala Ramakrishna Reddy: పరిషత్ ఎన్నికలపై హైకోర్టు తీర్పు పట్ల సజ్జల స్పందన
- గతంలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నిలిపివేత
- సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొట్టివేసిన హైకోర్టు డివిజన్ బెంచ్
- ఓట్లు లెక్కించవచ్చని ఆదేశాలు
- తీర్పును స్వాగతిస్తున్నామన్న సజ్జల
ఏపీలో పరిషత్ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే పరిషత్ ఎన్నికలు జరగాల్సి ఉన్నా, ఎన్నికలు జరపకుండా బాబు వాయిదా వేస్తూ వచ్చారని ఆరోపించారు. రిజర్వేషన్ల అంశంతో మరికొంత కాలయాపన జరిగిందని వివరించారు. గత ఎస్ఈసీ నిమ్మగడ్డ సైతం పరిషత్ ఎన్నికల విషయంలో ఏకగ్రీవాలను అడ్డుకునే ప్రయత్నం చేసి, టీడీపీ హైకమాండ్ ఆదేశాలను పాటించాడని సజ్జల ఆరోపించారు.
పరిషత్ ఎన్నికలు ఇంత ఆలస్యం కావడం వెనుక దోషి చంద్రబాబేనని, హైకోర్టు డివిజన్ బెంచ్ నేడు ఇచ్చిన తీర్పుతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పట్టిన గ్రహణం వీడిందని అన్నారు. ప్రజాస్వామ్యమే గెలిచిందన్నారు. డివిజన్ బెంచ్ తీర్పును స్వాగతిస్తున్నట్టు వెల్లడించారు.