Andhra Pradesh: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
- కరోనా నిబంధనలు పాటించాలని ఆదేశం
- కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలి
- పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచన
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అందుకు ఏపీ ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఎల్లుండే ఓట్ల లెక్కింపు ఉన్నందున అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
కలెక్టర్లు, ఎస్పీలు, డీపీవోలు, జడ్పీ సీఈవోలతో ఏర్పాట్లపై చర్చించారు. కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలన్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద మాస్కులు, భౌతిక దూరం వంటి కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. లెక్కింపు సజావుగా సాగేలా చూడాలని, పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలిచ్చారు.