Narendra Modi: రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు మోదీని ఆహ్వానించిన చినజీయర్ స్వామి
- మైహోమ్ రామేశ్వరరావుతో కలిసి మోదీని కలిసిన చినజీయర్ స్వామి
- రామానుజాచార్య పంచలోహ విగ్రహావిష్కరణకు హాజరు కావాలని ఆహ్వానం
- తప్పకుండా వస్తానని హామీ ఇచ్చిన మోదీ
భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు ప్రధాని మోదీని చినజీయర్ స్వామి ఆహ్వానించారు. మోదీని కలిసి ఆహ్వనపత్రికను అందించారు. ఈ సందర్భంగా సహస్రాబ్ది మహోత్సవాల విశిష్టతను మోదీకి వివరించారు. రామానుజాచార్య విగ్రహ ఆవిష్కరణకు తప్పకుండా హాజరుకావాలని కోరారు. సమతాస్పూర్తి కేంద్రం విశిష్టతను, 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహ విశిష్టతను, అక్కడ కొలువుదీరనున్న 108 దివ్యదేశాల వివరాలను ఈ సందర్భంగా మోదీకి వివరించారు.
చినజీయర్ వివరిస్తున్న విషయాలను మోదీ ఆసక్తిగా విన్నారు. సహస్రాబ్ది ఉత్సవాలకు తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు. చినజీయర్ స్వామితో పాటు మైహోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు కూడా ఉన్నారు. శంషాబాద్ లోని ముచ్చింతల్ ప్రాంతంలో రామానుజాచార్య పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి 14 వరకు ఈ మహోత్సవం జరగనుంది.