KCR: కాంగ్రెస్ సీనియర్ నేతలు గాడిదలైతే.. రేవంత్ రెడ్డి అడ్డగాడిదా?: కేటీఆర్
- రేవంత్ ది హడావుడే కానీ.. ఆయనకు అంత సీన్ లేదు
- షర్మిల, ప్రవీణ్ కుమార్ జాతీయ పార్టీలకు తొత్తులు
- ఆ రోజుల్లో సాయుధ పోరాటం చేసింది కమ్యూనిస్టులే
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేటీఆర్ ను ప్రశంసించిన కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ను రేవంత్ గాడిద అన్న సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత ఆయన క్షమాపణ చెప్పారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గాడిదలైతే.. రేవంత్ రెడ్డి అడ్డగాడిదా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి దూకుడు రియలెస్టేట్ వెంచర్ వంటిదని... మార్కెట్ చేసుకోవడానికి హడావుడే తప్ప, అయనకు అంత సీన్ లేదని అన్నారు.
వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల, బీఎస్సీ నేత ప్రవీణ్ కుమార్ లు జాతీయ పార్టీలకు తొత్తులని విమర్శించారు. ఎప్పుడూ కేసీఆర్ గురించి మాట్లాడటం తప్ప కాంగ్రెస్, బీజేపీలను వీరు విమర్శించరని అన్నారు. వీరిద్దరూ టీఆర్ఎస్ ఓట్లను చీల్చి, జాతీయ పార్టీలకు మేలు చేయాలని చూస్తున్నారని చెప్పారు. దమ్ముంటే కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉండే రాష్ట్రాల్లో బీసీబంధు పెట్టాలని సవాల్ విసిరారు. బీజేపీకి సాయుధ పోరాటం గురించి మాట్లాడే హక్కు లేదని... ఆ రోజుల్లో సాయుధ పోరాటం చేసింది కమ్యూనిస్టులేనని చెప్పారు.