Prabhas: కేన్సర్‌తో బాధపడుతున్న అభిమాని.. వీడియో కాల్ చేసి మాట్లాడిన నటుడు ప్రభాస్

Tollywood hero prabhas talked fan via video call
  • ప్రభాస్‌తో మాట్లాడాలని ఉందన్న అభిమాని
  • వైద్యుల ద్వారా సమాచారం అందుకున్న ప్రభాస్
  • ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిన అభిమాని
కేన్సర్‌తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభిమానికి ఫోన్ చేసి ఆమెను ఆశ్చర్యపరిచాడు టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్. శోభిత అనే అమ్మాయి కేన్సర్ బారినపడి హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇటీవల ఆమె వైద్యులతో మాట్లాడుతూ.. తాను ప్రభాస్ అభిమానినని, అతడితో మాట్లాడాలని ఉందని చెప్పింది. వైద్యుల ద్వారా విషయం తెలుసుకున్న ప్రభాస్ నిన్న వీడియో కాల్‌ చేసి శోభితతో సరదాగా ముచ్చటించాడు.

అభిమాన హీరో నుంచి ఫోన్ రావడంతో ఉబ్బితబ్బిబ్బయిన శోభిత తన బాధను మర్చిపోయి ప్రభాస్‌తో ఆనందంగా మాట్లాడింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులకు ఫోన్ చేసి సర్‌ప్రైజ్ ఇవ్వడం ప్రభాస్‌కు కొత్తకాదు. గతంలో మిర్చి సినిమా షూటింగ్ సందర్భంగా భీమవరంలో మృత్యువుతో పోరాడుతున్న 20 ఏళ్ల అభిమానితోనూ ప్రభాస్ ఇలాగే ముచ్చటించాడు.
Prabhas
Hyderabad
Tollywood
Cancer Patient

More Telugu News