Bihar: విద్యార్థిని బుగ్గ కొరికిన ప్రధానోపాధ్యాయుడు.. పోలీసుల ముందే చితకబాదిన గ్రామస్థులు

Head Master Bites Student Cheek Angry Villagers Thrashed Him In front Of Police
  • నాలుగో తరగతి బాలికకు లైంగిక వేధింపులు
  • బీహార్ లోని పిప్రి బహియార్ గ్రామంలో ఘటన
  • నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు
  • దాడి చేసిన వారిపైనా చర్యలు తప్పవని ఏఎస్పీ వార్నింగ్
నాలుగో తరగతి చదువుతున్న 12 ఏళ్ల విద్యార్థినిపై ప్రధానోపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ విద్యార్థిని చెంపను కొరికాడు. ఆ బాలిక కేకలు వేయడంతో స్థానికులు పరుగుపరుగున వచ్చి ఆ హెడ్ మాస్టర్ ను స్కూల్ గదిలో బంధించారు. ఈ ఘటన బీహార్ లోని కతిహార్ జిల్లా పిప్రి బహియార్ లోని ప్రాథమిక పాఠశాలలో జరిగింది.

హెడ్ మాస్టర్ ను గదిలో బంధించిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులతో పాటు స్కూలు వద్దకు చేరుకున్న బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు.. హెడ్ మాస్టర్ ను బయటకు లాగి పోలీసుల ముందే కర్రలతో చితకబాదారు. ఆగ్రహంతో ఊగిపోయిన జనం నుంచి ప్రధానోపాధ్యాయుడిని కాపాడడం పోలీసులకు కష్టతరమైపోయింది. ఎలాగోలా వారి బారి నుంచి అతడిని తప్పించిన పోలీసులు.. స్టేషన్ కు తరలించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

అయితే, ఘటన జరిగినప్పుడు అసలేం జరిగిందో తనకు అర్థం కాలేదని, తన బుర్ర పనిచేయలేదని నిందితుడు పోలీసులకు చెప్పాడు. కాగా, హెడ్ మాస్టర్ ను చితకబాదిన వీడియోలు వైరల్ కావడంతో.. కటిహార్ ఏఎస్పీ రష్మి స్పందించారు. ఆ వీడియోలు ఇంకా తన దృష్టికి రాలేదని, ఒకవేళ అదే నిజమైతే దాడి చేసిన వారిపైనా చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని ఆమె తెలిపారు.
Bihar
Crime News
Head Master
School
Molestation
Police

More Telugu News