Chris Cairns: సర్జరీ సమయంలో పక్షవాతానికి గురయ్యానన్న క్రిస్ కెయిన్స్
- ఇటీవల క్రిస్ కెయిన్స్ కు గుండె ఆపరేషన్
- ఆపరేషన్ సమయంలో స్ట్రోక్ కు గురైన క్రిస్
- డాక్టర్లు, నర్సులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని వ్యాఖ్య
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ క్రిస్ కెయిన్స్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ఆల్ రౌండర్ గా తన దేశానికి ఎన్నో విజయాలను అందించిన కెయిన్స్... స్ట్రోక్ కు గురై పక్షవాతానికి గురయ్యారు. ఈ విషయాన్ని వీడియో ద్వారా ఆయన తెలిపారు.
గత నెలలో ఆయనకు హార్ట్ ఆపరేషన్ జరిగింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆయనకు ఎమర్జెన్సీ ఆపరేషన్ నిర్వహించారు. అయితే ఆపరేషన్ ను నిర్వహిస్తున్న సమయంలో ఆయనకు స్ట్రోక్ రావడంతో పక్షవాతానికి గురయ్యారు. దీనిపై ఆయన స్పందిస్తూ... తన జీవితంలో అతిపెద్ద సవాలును ఎదుర్కొన్నానని చెప్పారు. తన జీవితాన్ని కాపాడిన సర్జన్లు, డాక్టర్లు, నర్సులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.
క్రిస్ కెయిన్స్ న్యూజిలాండ్ కు 1989 నుంచి 2004 వరకు 62 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఈ మ్యాచుల్లో బ్యాటింగ్ లో 33.53 సగటు, 29.4 సగటు సాధించాడు. వీటిలో 87 సిక్సులు సాధించాడు. అప్పట్లో ఇదొక ప్రపంచ రికార్డు. అయితే, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఆమె ఇమేజ్ దెబ్బతింది. ఆ కేసుల నుంచి ఆయన క్లియర్ గా బయటపడినప్పటికీ... అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.