Excise Dept: డ్రగ్స్ కేసులో కెల్విన్ వాంగ్మూలం నమ్మశక్యంగా లేదు: ఎక్పైజ్ శాఖ

Excise dept opines on Kelvin statement
  • సినీ తారలకు డ్రగ్స్ విక్రయించినట్టు కెల్విన్ వెల్లడి
  • ఆ మేరకు వాంగ్మూలం
  • ఇటీవల ఎఫ్ఎస్ఎల్ నివేదిక
  • పూరీ జగన్నాథ్, తరుణ్ లకు క్లీన్ చిట్
చిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం రేపిన డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ నిందితుడు కెల్విన్ వాంగ్మూలం నమోదు చేయడం తెలిసిందే. సినీ తారలు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు డ్రగ్స్ విక్రయించినట్టు కెల్విన్ తన వాంగ్మూలంలో వెల్లడించాడు. అయితే, ఇటీవల వచ్చిన ఫోరెన్సిక్ రిపోర్టులో పూరీ జగన్నాథ్, తరుణ్ ల శాంపిల్స్ లో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు లేవని వెల్లడైంది.

ఈ నేపథ్యంలో, ఎక్సైజ్ శాఖ కెల్విన్ వాంగ్మూలం నమ్మశక్యంగా లేదని పేర్కొంది. కెల్విన్ చెప్పిన విషయాలను ఆధారాలుగా భావించలేమని వివరించింది. పూరీ జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవన్నది ఎఫ్ఎస్ఎల్ నివేదికతో స్పష్టమైందని వెల్లడించింది. సెలబ్రిటీలను నిందితులుగా చేర్చేందుకు కేవలం కెల్విన్ వాంగ్మూలం సరిపోదని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. సెలబ్రిటీలు, అనుమానితుల వద్ద డ్రగ్స్ లభించలేదని తెలిపింది.
Excise Dept
Kelvin
Drugs Case
Tollywood

More Telugu News