Nagachaitanya: శేఖర్ కమ్ముల ముందుగా నన్ను ఒప్పుకోలేదు: 'లవ్ స్టోరీ' మ్యూజిక్ డైరెక్టర్
- మొదటి నుంచి సంగీతమంటే ఇష్టం
- రెహ్మాన్ గారి దగ్గర పనిచేశాను
- ఆయన నన్ను ప్రోత్సహించారు
- శేఖర్ కమ్ముల గారిని మెప్పించాను
నాగచైతన్య - సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' సినిమాను రూపొందించాడు. నారాయణ దాస్ నారంగ్ - రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక అందమైన ప్రేమకథనే ఈ సినిమా. ఈ సినిమా పాటలకు విశేషమైన ఆదరణ లభించింది. అలాంటి పాటలను అందించిన ఆ సంగీత దర్శకుడి పేరే పవన్ సీహెచ్.
తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. " మా తాతయ్య .. మా నాన్న ఇద్దరూ కూడా సినిమాటోగ్రఫర్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. కానీ నేను మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ ను కావాలని అనుకునేవాడిని. నా ఇష్టాన్ని అర్థం చేసుకుని మా పేరెంట్స్ సంగీతాన్ని నేర్పించారు. ఆ తరువాత నా టాలెంట్ ను గుర్తించి ఏఆర్ రెహ్మాన్ గారు ప్రోత్సహించారు. ఆయన టీమ్ లో కొంతకాలం పనిచేశాను.
శేఖర్ కమ్ములగారి సినిమాకు పనిచేయాలని ఉండేది. 'ఫిదా' సినిమా సమయంలో ఆయనను కలిశాను .. కానీ ఆయన అప్పుడు అవకాశం ఇవ్వలేదు. 'లవ్ స్టోరీ' కోసం 'హే పిల్లా' పాట చేసి వినిపిస్తే ఆయనకి నచ్చింది. ఆ తరువాత కూడా అనేక టెస్టులు పెట్టిన తరువాతనే ఓకే అన్నారు" అంటూ చెప్పుకొచ్చాడు.