Ayesha Mira: ఆయేషా మీరా హత్యకేసు: నిందితుల నార్కో పరీక్షల కోసం సీబీఐ పిటిషన్.. కొట్టేసిన కోర్టు

Vijayawada Ayesha mira Case court dismiss cbi petition

  • 27 డిసెంబరు 2007న హత్యకు గురైన ఆయేషా మీరా
  • కోనేరు సతీశ్ సహా మరో ఏడుగురిపై నార్కో పరీక్షలకు అనుమతి కోరిన సీబీఐ
  • ఆయేషా స్నేహితురాళ్ల సమాచారం కీలకమన్న సీబీఐ

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో 27 డిసెంబరు 2007న హత్యకు గురైన ఆయేషా మీరా కేసులో అనుమానితులకు నార్కో అనాలసిస్ పరీక్షలు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను విజయవాడ కోర్టు కొట్టివేసింది. ఆయేషా హత్య కేసులో కోనేరు సతీశ్, మరో ఏడుగురిపై నార్కో అనాలసిస్ పరీక్షలకు అనుమతి ఇవ్వాలంటూ విజయవాడలోని నాలుగో అదనపు చీఫ్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. సతీశ్‌తోపాటు హాస్టల్‌లో ఆయేషాతో ఉన్న స్నేహితురాళ్ల సమాచారం ఈ కేసులో కీలకమని, వారికి నార్కో అనాలసిస్ పరీక్షలు అవసరమని సీబీఐ ఆ పిటిషన్‌లో పేర్కొంది. వాదనలు విన్న న్యాయస్థానం సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది.

  • Loading...

More Telugu News