CM Jagan: స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోపై సీఎం జగన్ సమీక్ష
- అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు
- గంజాయి సాగును అరికట్టాలని స్పష్టీకరణ
- ఎస్ఈబీ కాల్ సెంటరు నెంబరుపై ప్రచారం చేయాలని సూచన
- విద్యార్థుల్లో చైతన్యం కలిగించాలని వెల్లడి
ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) కార్యకలాపాలపై నేడు సమీక్ష నిర్వహించారు. అక్రమ మద్యం తయారీ, రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. మద్య నియంత్రణ చర్యలను పక్కాగా అమలు చేయాలన్నారు. ఇసుకను నిర్ణీత ధరకంటే ఎక్కువకు అమ్మితే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఎస్ఈబీ కాల్ సెంటర్ నెంబరును విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. మాదక ద్రవ్యాలపై కాలేజీలు, వర్సిటీల్లో చైతన్యం కలిగించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపి అరికట్టాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. గుట్కా విక్రయాలు, రవాణాపై మరింత దృష్టి సారించాలని నిర్దేశించారు.