Taliban: దోషుల కాళ్లు, చేతులు న‌రికే శిక్ష‌లు అమ‌లు చేస్తాం!: తాలిబ‌న్లు

talibans on punishment to convicts

  • స్పష్టం చేసిన‌ తాలిబన్‌ వ్యవస్థాపక స‌భ్యుడు  ముల్లా నూరుద్దీన్‌
  • మా అంతర్గత వ్యవహారాల్లో ఇత‌రులు జోక్యం చేసుకోకూడదు 
  • మా చట్టాలు ఎలా ఉండాలో మాకు చెప్పకూడ‌దు
  • శిక్ష‌ల‌ను బహిరంగంగా అమలు చేయాలా? అన్న దానిపైనే చ‌ర్చ‌లు

ఆఫ్ఘ‌నిస్థాన్‌లో తాలిబ‌న్లు తాత్కాలిక ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. గ‌తంలోలా వ్య‌వ‌హ‌రించ‌బోమ‌ని మొదట్లో చెప్పిన తాలిబ‌న్లు మాట మీద నిల‌బ‌డ‌డం లేదు. ఆఫ్ఘ‌న్‌లో మ‌ళ్లీ అనాగ‌రిక విధానాల‌ను ప్ర‌వేశ‌పెట్టడానికి సిద్ధ‌మ‌య్యారు. 1990ల నాటిలాగే ఆఫ్ఘ‌న్‌లో ఇప్పుడు కూడా కాళ్లు, చేతులు నరకడం వంటి కఠిన శిక్షలు అమల్లో ఉంటాయని తాలిబ‌న్లు తేల్చి చెబుతున్నారు.
 
తాలిబన్‌ వ్యవస్థాపక స‌భ్యుడు ముల్లా నూరుద్దీన్‌ తురాబీ మీడియాతో మాట్లాడుతూ.. త‌మ దేశ‌ అంతర్గత వ్యవహారాల్లో ఇత‌రులు జోక్యం చేసుకునే అవ‌స‌రం లేద‌ని చెప్పారు. త‌మ‌ చట్టాలు ఎలా ఉండాలనే విష‌యం వారు చెప్పకూడ‌ద‌ని అన్నారు. తాము ఇస్లాంను అనుసరిస్తామ‌ని, ఖురాన్‌ ప్రకారమే చట్టాలు రూపొందించుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

గతంలో తాము ఆఫ్ఘ‌న్‌లో జ‌రిపిన ప‌రిపాలన తరహాలోనే ఇప్పుడు కూడా త‌మ దేశంలో దోషులకు కఠిన శిక్ష‌లు విధిస్తామ‌ని చెప్పారు. ఆఫ్ఘ‌న్‌లో చేతులు, కాళ్లు నరకడం వంటి శిక్షలను అమలు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. అయితే, ఆ శిక్ష‌ల‌ను బహిరంగంగా అమలు చేయాలా? అన్న దానిపై మాత్రమే చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు.

  • Loading...

More Telugu News