Sensex: రోజంతా లాభాల్లోనే కొనసాగిన మార్కెట్లు.. 60 వేల పాయింట్ల పైన ముగిసిన సెన్సెక్స్
- 60,148 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్
- 30 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 3.72 శాతం పెరిగిన ఏసియన్ పెయింట్స్ షేర్ వాల్యూ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు రికార్డు స్థాయుల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే 60 వేల మార్క్ ను అధిగమించిన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కొనసాగి చివరకు 60 వేల పాయింట్ల పైనే ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఒకానొక సమయంలో 60,048కి పెరిగింది. చివరకు 163 పాయింట్ల లాభంతో 60,148 వద్ద ముగిసింది. నిఫ్టీ 30 పాయింట్లు పెరిగి 17,853 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఏసియన్ పెయింట్స్ (3.72%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.74%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.98%), భారతి ఎయిర్ టెల్ (1.79%), మారుతి సుజుకి (1.59%).
టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-3.60%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.00%), యాక్సిస్ బ్యాంక్ (-1.74%), ఐటీసీ (-1.67%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.44%).