Jagga Reddy: అసెంబ్లీ లాబీలో జగ్గారెడ్డి, రసమయి బాలకిషన్ మధ్య సరదా సంభాషణ

Funny talk between Jagga Reddy and Rasamai Balakishan in Assembly lobby
  • ఈరోజు ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
  • ఈ మధ్య కాలంలో గొంతు మూగబోయిందేమిటని ప్రశ్నించిన జగ్గారెడ్డి
  • అవసరాన్ని బట్టి గొంతు బయటకు వస్తుందన్న రసమయి
తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వివిధ పార్టీల ఎమ్మెల్యేలతో అసెంబ్లీ ఆవరణ కళకళలాడింది. ఈ సందర్భంగా అసెంబ్లీ లాబీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య సరదా సంభాషణ చోటు చేసుకుంది.

గాయకుడు అయిన రసమయిని ఉద్దేశించి జగ్గారెడ్డి మాట్లాడుతూ, ఈ మధ్య కాలంలో గొంతు మూగబోయిందేమిటని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా అవసరాన్ని బట్టి గొంతు బయటకు వస్తుందని రసమయి నవ్వుతూ అన్నారు. తన పాట తెలంగాణ అమరవీరులకు, త్యాగాల పునాదులకు అంకితమని చెప్పారు. ఇటీవలే రసమయి తెలంగాణ సాంస్కృతిక సారథిగా నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఈ పదవిలో ఆయన కొనసాగనున్నారు.
Jagga Reddy
Congress
Rasamai Balakishan
TRS

More Telugu News