VaraVara Rao: బాంబే హైకోర్టులో వరవరరావు బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా

Bombay High Court Adjourned Varavara Rao Bail Petition

  • ఎల్గార్ పరిషత్ కేసులో ఆరోపణలు
  • బెయిలు పొడిగించాలని, హైదరాబాద్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్
  • అక్టోబరు 13 వరకు లొంగిపోవాల్సిన అవసరం లేదన్న ధర్మాసనం
  • కఠిన చర్యలు తీసుకోవద్దని ఎన్ఐఏకు ఆదేశం

ఎల్గార్ పరిషత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విప్లవకవి వరవరరావు (82)కు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. అనారోగ్య కారణాలతో బెయిలుపై విడుదలైన వరవరరావు భార్యతో కలిసి ముంబైలోనే ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. బెయిలును పొడిగించడంతోపాటు స్వస్థలం హైదరాబాద్‌లో ఉండేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

మెదడులోను, కళ్లలోనూ సమస్యలు వచ్చాయని జైలులో వీటికి తగిన చికిత్స అందుబాటులో లేదని వరవరరావు తన పిటిషన్‌ పేర్కొన్నారు. అలాగే, పార్కిన్సన్స్ వ్యాధి వచ్చినట్టు అనుమానం ఉందన్నారు. అయితే, సమయం మించిపోవడంతో ఈ పిటిషన్‌ను పూర్తిగా విచారించలేకపోయిన ధర్మాసనం వరవరరావుకు కాస్త ఊరట నిచ్చింది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఎన్ఐఏను ఆదేశించింది. అక్టోబరు 14 వరకు తోలోజా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాల్సిన అవసరం లేదని పేర్కొంటూ విచారణను వచ్చే నెల 13కు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News