Tina Dabi: సివిల్స్ పరీక్షలు... అప్పుడు అక్క ఫస్ట్ ర్యాంక్ సాధిస్తే.. ఇప్పుడు చెల్లెలు 15వ ర్యాంక్ సొంతం చేసుకుంది!

Ria Dabi secures 15 rankin UPSC 2020

  • 2015లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన టీనా దాబి
  • ఇప్పడు 15వ ర్యాంక్ సాధించిన రియా దాబి
  • అక్క స్ఫూర్తితో సివిల్స్ ను సాధించిన రియా

దేశంలోనే అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగాలైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితరాల కోసం నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాలు నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల్లో జయకేతనం ఎగురవేసిన వారందరి సక్సెస్ స్టోరీలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. వీరిలో 15వ ర్యాంక్ సాధించిన రియా దాబి కథ ఒకటి.
 
ఆమె అక్క టీనా దాబి 2015 సివిల్స్ పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అంతేకాదు సివిల్స్ పరీక్షల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న తొలి దళిత మహిళగా ఆమె పేరు మారుమోగిపోయింది. ప్రస్తుతం ఆమె రాజస్థాన్ ప్రభుత్వంలో ఆదాయపు పన్ను శాఖలో పని చేస్తున్నారు. ఇప్పుడు ఆమె సోదరి రియా దాబి 15వ ర్యాంక్ సాధించారు. తన అక్క నుంచి స్ఫూర్తి పొందిన ఆమె... దేశ అత్యున్నత సర్వీసుకు ఎంపికయ్యారు. వీరిద్దరూ కూడా ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్ లో చదువుకున్నారు.

  • Loading...

More Telugu News