Tamil Hero Vijay: తమిళ హీరో విజయ్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు కాంబోలో భారీ చిత్రం

Dil Raju big project with Tamil hero Vijay and Vamshi Paidipally
  • దిల్ రాజు బ్యానర్ నుంచి మరో క్రేజీ ప్రాజెక్టు
  • వంశీ పైడిపల్లి దర్శకత్వంలో హీరో విజయ్ 66వ చిత్రం
  • సోషల్ మీడియాలో వెల్లడించిన చిత్రనిర్మాణ సంస్థ
  • అటు రామ్ చరణ్-శంకర్ కాంబోలో దిల్ రాజు మరో చిత్రం
నిర్మాత దిల్ రాజు ఇటీవల భారీ కాంబినేషన్లతో చిత్రాలను రూపొందించే పనిలో పడ్డారు. రామ్ చరణ్, శంకర్ కాంబోలో భారీ బడ్జెట్ చిత్రానికి శ్రీకారం చుట్టిన దిల్ రాజు... తాజాగా తమిళ హీరో విజయ్ తో క్రేజీ ప్రాజెక్టుకు తెరలేపారు. విజయ్ హీరోగా నటించే ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా విజయ్ కెరీర్ లో 66వ చిత్రం. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో వెల్లడించింది. హీరో విజయ్, దిల్ రాజు, వంశీ పైడిపల్లి కలిసున్న ఫొటోను కూడా పంచుకుంది.
Tamil Hero Vijay
Dil Raju
Vamshi Paidipally
Tollywood
Kollywood

More Telugu News