Nayanthara: కాబోయే భర్తతో కలిసి తిరుమల వెంకన్నను దర్శించుకున్న నయనతార

Actress Nayanthara visits Tirumala with Vignesh Shivan
  • విఘ్నేశ్ శివన్ ప్రేమలో ఉన్న నయనతార
  • త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ప్రేమ జంట
  • వీఐపీ దర్శనం సమయంలో శ్రీవారిని దర్శించుకున్న జంట
ప్రముఖ సినీ నటి నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి ఈ ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. సంప్రదాయబద్ధమైన వస్త్రాలను ధరించి వీఐపీ దర్శన సమయంలో స్వామిని దర్శించుకున్నారు. దర్శనానంతరం అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ఆలయం నుంచి బయటకు వచ్చిన నయనతారను చూడటానికి భక్తులు ఉత్సాహం చూపించారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు యత్నించారు. ప్రస్తుతం ఆమె లయన్, పట్టు, ఆటో జానీ, త్రిష్ణ, గోల్డ్ సినిమాల్లో నటిస్తోంది. మరోవైపు టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఈరోజు వెంకన్నను దర్శించుకున్నారు.
Nayanthara
Vignesh Shivan
Tollywood
Kollywood
Tirumala

More Telugu News