Cyclone Gulab: భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కంట్రోల్ రూముల ఏర్పాటు
- గులాబ్ తుపాను నేపథ్యంలో నిన్నటి నుంచి వర్షాలు
- 24 గంటలూ అందుబాటులో ఉండేలా కంట్రోలు రూముల ఏర్పాటు
- అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి సబిత
గులాబ్ తుపాను నేపథ్యంలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కంట్రోల్ రూమును ఏర్పాటు చేసింది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో 24 గంటలూ అందుబాటులో ఉండేలా 040-23230817 నంబరుతో ఈ కంట్రోల్ రూమును ఏర్పాటు చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. అత్యవసర సాయం కోసం పై నంబరును సంప్రదించాలని కోరారు.
అలాగే, సాయం అవసరమైన ప్రజలు 9492409781 నంబరును సంప్రదించవచ్చని మేడ్చల్ జిల్లా ఇన్చార్జ్ ఎస్. హరీశ్ సూచించారు. అలాగే, భారీ వర్షాల నేపథ్యంలో సైబరాబాద్, రాచకొండ పోలీసులు అప్రమత్తమయ్యారు. 24 గంటలూ అందుబాటులో ఉండేలా కమాండ్ కంట్రోలు రూమును ఏర్పాటు చేశారు. హైదరాబాద్ వాసుల కోసం 94906 17100, 83310 13206, 040-27853413, 040-27853412, రాచకొండ పరిధిలోని వారి కోసం 94906 17111 నంబర్లతో కంట్రోలు రూములు ఏర్పాటు చేశారు. అలాగే, 1912 టోల్ ఫ్రీ నంబరును కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.