China: భార‌త స‌రిహ‌ద్దుల వ‌ద్ద మ‌ళ్లీ త‌న బుద్ధిని ప్ర‌ద‌ర్శిస్తోన్న చైనా

china army at ladakh

  • తూర్పు లడ‌ఖ్‌లో సముద్ర మట్టానికి ఎత్తయిన ప్రాంతాల్లో నిర్మాణాలు
  • పెద్ద ఎత్తున సైనికులను మోహరించేందుకు ప్రయత్నాలు
  •  మౌలిక సదుపాయాలు కల్పించడంపైనా చైనా  దృష్టి
  • నిశితంగా ప‌రిశీలిస్తోన్న‌ భార‌త్  

స‌రిహ‌ద్దుల వ‌ద్ద చైనా మ‌ళ్లీ త‌న వక్ర బుద్ధిని ప్ర‌ద‌ర్శిస్తోంది. ఓ వైపు శాంతి వచ‌నాలు పలుకుతూ, మ‌రోవైపు దుందుడుకు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంది. తూర్పు లడ‌ఖ్‌లో సముద్ర మట్టానికి ఎత్తయిన ప్రాంతాల్లో కంటైనర్‌ ఆధారిత స్థావరాల నిర్మాణాలు జ‌రుపుతోంది.

అక్కడ పెద్ద ఎత్తున సైనికులను మోహరించేందుకు ప్రయత్నిస్తోంది. వారి కోసమే కొత్తగా శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. తషిగాంగ్ తో పాటు మాంజా, హాట్‌ స్ప్రింగ్స్, చురుప్ వంటి ప్రాంతాల్లో చైనా ఈ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంది. అక్క‌డక్కడ త‌మ సైన్యానికి మౌలిక సదుపాయాలు కల్పించడంపైనా చైనా దృష్టి పెట్టినట్లు సమాచారం.

గ‌తంలోలా కాకుండా కొన్ని ప్ర‌త్యేక‌ భూభాగాల్లోనూ సైన్యాన్ని మోహరించాలని ప్ర‌య‌త్నిస్తోంది. చైనా చ‌ర్య‌ల‌ను భార‌త్ నిశితంగా ప‌రిశీలిస్తోంది. వాటిని ఎప్ప‌టిక‌ప్పుడు తిప్పికొట్టేలా తన ఏర్పాట్లు తాను చేసుకుంటోంది. అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో చైనా త‌మ సైనికుల‌ను మోహ‌రించాల‌నుకోవ‌డం ఆ దేశానికి చాలా క్లిష్ట‌మైన ప‌ని అని భార‌త సైనిక అధికారి ఒక‌రు చెప్పారు.

  • Loading...

More Telugu News