Anandaiah: నా కరోనా మందు ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డంకులు సృష్టించారు: ఆనందయ్య సంచలన వ్యాఖ్యలు

Ayurveda doctor Anandaiah made sensational comments

  • నన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు కూడా వచ్చారు
  • గ్రామస్థులంతా అండగా నిలవడంతో పోలీసులు వెనుదిరిగారు
  • ఆయుర్వేదానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించాల్సి ఉంది

కరోనా సెకండ్ వేవ్ ఏ స్థాయిలో విరుచుకుపడిందో, ఎన్ని ప్రాణాలను బలి తీసుకుందో అందరికీ తెలిసిన విషయమే. కరోనా పంజా విసురుతున్న సమయంలో అదే స్థాయిలో చర్చనీయాంశంగా మారిన వ్యక్తి ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య. కరోనా నివారణ కోసం ఆనందయ్య తయారు చేసిన మందు కోసం ఆ రోజుల్లో జనాలు ఎగబడ్డారు. ఆయన ఉంటున్న గ్రామం పెద్ద జాతరను తలపించింది. జనాలను అదుపు చేసేందుకు పోలీసులు సైతం రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ తర్వాత ఆయన మందు ఎంత మేరకు నాణ్యమైనదనే విషయమై పరీక్షలు కూడా జరిగాయి. అయితే ఆ తర్వాత క్రమంగా ఆనందయ్య మందు మరుగున పడిపోయింది.

తాజాగా ఆనందయ్య మాట్లాడుతూ సంచలన విషయాలను వెల్లడించారు. తాను కనిపెట్టిన మందు ప్రజల్లోకి వెళ్లకుండా ఎన్నో అడ్డంకులు సృష్టించారని అన్నారు. తనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు కూడా వచ్చారని... అయితే, గ్రామస్థులంతా అండగా నిలవడంతో అరెస్ట్ చేయకుండా వెనుదిరిగారని చెప్పారు. విజయనగరంలో జరిగిన యాదవ మహాసభ సమితి కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయుర్వేదానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News