KKR: మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్న కోల్ కతా నైట్ రైడర్స్
- షార్జాలో కోల్ కతా వర్సెస్ ఢిల్లీ
- 3 వికెట్ల తేడాతో నెగ్గిన కోల్ కతా
- 128 పరుగుల టార్గెట్ నిర్దేశించిన ఢిల్లీ
- 18.2 ఓవర్లలో 7 వికెట్లను ఛేదించిన కోల్ కతా
ఐపీఎల్ తాజా అంచెలో కోల్ కతా నైట్ రైడర్స్ స్ఫూర్తిదాయకమైన ఆటతీరు కనబరుస్తోంది. ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ తో షార్జా మైదానంలో జరిగిన పోరులో కోల్ కతా 3 వికెట్ల తేడాతో నెగ్గింది. ఢిల్లీ నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని కోల్ కతా జట్టు 7 వికెట్లు కోల్పోయి 18.2 ఓవర్లలో ఛేదించింది. చివర్లో సునీల్ నరైన్ 10 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సుల సాయంతో 21 పరుగులు చేశాడు.
అంతకుముందు నితీశ్ రాణా 36, ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 30 పరుగులు సాధించారు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ డకౌట్ అయినా, సాధించాల్సిన స్కోరు తక్కువ కావడంతో కోల్ కతా విజయాన్ని అందుకుంది. భారత్ లో జరిగిన ఐపీఎల్ 14వ సీజన్ తొలి భాగంలో పేలవంగా ఆడిన కోల్ కతా... రెండో అంచెలో మాత్రం దూసుకుపోతోంది. కోల్ కతా విజయాలతో ఇతర జట్ల ప్లే ఆఫ్ అవకాశాలపై ప్రభావం పడుతోంది.
ఇక, నేడు జరిగే రెండో మ్యాచ్ లో ముంబయి, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబయి జట్టు బౌలింగ్ ఎంచుకుంది.